సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైద్య విద్యలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయస్థాయిలో నిర్వహించిన నీట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 40,344 మంది అర్హత సాధించారు. అయితే వీరిలో అగ్రస్థానంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు కీలక ర్యాంకులు సాధించారు. గణపవరం దగ్గర లోని కొయ్యలగూడెంకి చెందిన చెదలవాడ వినయ్ చక్రవర్తి ఆల్ ఇండియాలో 9వ ర్యాంకు ను సాధించడం పెద్ద విశేషంగా చెప్పుకోవాలి. ఇక తాడేపల్లిగూడెంకు చెందిన ఎండీఎస్ కీర్తితేజ 12వ ర్యాంకుతో స్టేట్ ఫస్ట్ సాధించాడు. ఇతను వెలివెన్నులో చదువుతున్నాడు. పెనుగొండకి చెందిన ఆసు హిందూ 687 మార్కులతో ఆలిండియాలో 33వ ర్యాంకు (ఈడబ్ల్యూఎస్ కేటగిరీ) సాధించింది. ఓపెన్ క్యాటగిరిలో 401వ ర్యాంకుతో సత్తా చాటింది. పెనుగొండకి చెందిన శిద్దాని హిమవర్షిణి 677 మార్కులతో జాతీయ స్థాయిలో 957వ ర్యాంకు సాధించింది. చింతలపూడికి చెందిన కొత్తూరు ప్రజ్వలకు 546, కోట నిస్సిజోయ్కి 586 మార్కులు వచ్చాయి. చిట్టవరం గ్రామానికి చెందిన సాయి నవీన్ కృష్ణ 658 మార్కులు, నరసాపురం లో స్థానిక కౌన్సిలర్ కావలి రామసీత కుమారుడు రాహుల్ నర్సింహ నాయుడు 621 మార్కులు, చినమామిడిపల్లి ప్రాంతానికి చెందిన జొన్నల దుర్గాశంకరి 615 మార్కులు,సాధించడం గమనార్హం.. వీరందరూ భవిషత్తు లో వైద్యులుగా రాణించి ప్రజలకు మంచి సేవలు అందించాలని కోరుకొందాం..
