సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈ ఏడాది సంక్రాంతి పండగ కు వచ్చి విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం. తెలుగు సినీ పరిశ్రమలో అల్ టైం ఇండస్ట్రీ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టేసిన ఈ సినిమా.సంచలనాలు 50 రోజులు అయిన సృష్టిస్తూనే ఉంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్‏కు ఫ్యామిలీ అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో కుర్ర హీరోయిన్లు తో ఒకప్పటి వెంకీ గ్లామర్ స్పీడ్, స్టైల్, మేనరిజం, కామెడీ టైమింగ్ మరోసారి తెరపై మాయ చేసింది. ఇప్పటికే ప్రముఖ ఛానెల్ జీ 5 సంక్రాంతికి వస్తున్నాం సినిమాను టెలికాస్ట్ చేసింది. ఇప్పటికే ఎన్నో రికార్డ్ అందుకున్న సంక్రాంతికి వస్తున్నాం తాజాగా మరో అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత పెద్ద సినిమా అయినా, నాలుగు 5వారాలకంటే థియేటర్స్ లో ఉండటం లేదు. అలాంటిది సంక్రాంతికి వస్తున్నాం సినిమా 92 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఏకంగా 12 కోట్లపైగా కలెక్షన్ 9 కోట్ల పైగా షేర్ వసూళ్లు సాధించింది. ఇక భీమవరంలో సుమారు 2 కోట్ల కలెక్షన్ దిశగా అడుగులు వేస్తుంది. ఇక ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 ఓటీటీలో ఈ సినిమా ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. అంతే కాదు ఓటీటీలోనూ ఈ సినిమా కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం 12 గంటల్లోనే 13 లక్షల మంది వీక్షించారని జీ 5 తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *