సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈరోజు హైదరాబాద్ లో ఎన్టీఆర్ ఘాట్ వద్ద నేటి,గురువారం ఉదయం జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వచ్చి, స్వర్గీయ ఎన్టీఆర్ సమాధికి నివాళి అర్పించి వెళ్ళాక బాలకృష్ణ తో సహా మిగతా నందమూరి కుటుంబ సభ్యులు వచ్చి నివాళ్లు అర్పించి వెళుతున్న సందర్భంలో బాలకృష్ణకు అక్కడ పెట్టిన 2 జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను ఒక వ్యక్తి ఆయన దృష్టికి తేవడం వాటిని చుసిన ఆయన ఆగ్రహంతో ‘తీసేయ్’ అనడంతో అక్కడ బాలకృష్ణ అభిమానులు.. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ లను తొలగించి బయట కనపడకుండా త్రిపి పెట్టిన వీడియో తెలుగు రాష్ట్రాలలో వైరల్ అవుతుంది. ఈ ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వరుస ఘటనలతో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కు మధ్య దూరం మరింత పెరిగిందనే చెప్పాలి. ఎన్నికలు సమీపిస్తున్న వేళా నందమూరి కుటుంబంలో ఇటువంటి విభేదాలు టీడీపీ పార్టీకి ఏమాత్రం మేలు చేస్తాయో? చూడాలి..
