సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర నుండి అమెరికా వరకు పవన్ అభిమానులు ‘ఓజీ’ ఫీవర్‌తో ఊగిపోతున్నారు. తెలుగు రాష్ట్రాలలో నేటి బుధవారం రాత్రి 8 గంటల నుండి ప్రారంభం అయ్యే ప్రీమియర్ షో లకు టికెట్స్ ధర 1000 రూపాయలు అయిన అడ్వాన్స్ బుకింగ్స్ హోసే ఫుల్ కు ఎక్కడ తగ్గడంలేదు. ఇదిలా ఉండగా ఇప్పటికే నార్త్ అమెరికాలో పవన్ కెరీర్ లో తొలిసారి ప్రీమియర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 2.11 మిలియన్ డాలర్లకి పైగా కలెక్షన్లు రాగా.. ఇవి మరింత పెరిగేలా కనిపిస్తున్నాయి. అయితే ఎదో దిష్టి తగిలినట్లు.. సినిమా కంటెంట్ డెలివరీలో ఆలస్యం కారణంగా ( సెక్కురిటీ రీజన్స్ అని కొందరు అంటున్నారు?) అమెరికాలోని AMC సినిమా థియేటర్స్ కొన్ని ప్రీమియర్ షోలను రద్దు చేయగా, ప్యాన్స్ కు డబ్బు తిరిగి ఇచ్చెయ్యడంతో, సుమారు $80,000 ఆదాయం తగ్గినట్లు సమాచారం. ఇదే సమస్య కెనడాలో కూడా ఎదురవడంతో మరో $160,000 నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద సినిమా విషయంలో మేకర్స్. ప్రీమియర్స్ వెయ్యలేక ఇబ్బందులు పాలు కావడం అక్కడి అభిమానుల్లో నిరాశను కలిగించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *