సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: తెలుగువారి రౌడీ హీరో విజయ్ దేవరకొండ , డేర్ డెవిల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ ల కాంబినేషన్‌లో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా ‘లైగర్’ భారీ ప్రమోషన్ల మధ్య ఆగస్ట్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. అసలు సినిమా ఎలా ఉందొ చాలామంది ప్రేక్షకులు చూడకుండానే .. భారీ నెగిటివ్ టాక్ ప్రచారం కావడం తో ఆసక్తి ఉన్నవారు కూడా ఓటిటి లో చూద్దాం అని థియేటర్స్ కు వెళ్ళటం మానేశారు. అయితే వారి కోరిక మన్నిస్తూ.. అనుకున్న సమయానికంటే ముందుగానే.. తాజాగా (సెప్టెంబర్ 22 ) డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ లో విడుదలై సంచలనం సృష్టిస్తోంది. ప్రపంచంలో ది గ్రేట్ బాక్సర్.. మైక్ టైసన్ ‘లైగర్’ సినిమాతో ఇండియన్ సినిమాలో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. మగ సింహం, ఆడ పులి జతకట్టినప్పుడు ఫలితంగా వచ్చే సంతానానికి పెట్టే పేరుతో వచ్చిన ఈ సినిమా.. టైటిల్‌తోనే దేశమంతా మాట్లాడుకున్న సినిమాగా నిలిచిపోయింది. నేడు, గురువారం నుంచి ‘లైగర్’ స్ట్రీమింగ్ ఒటిటి లో ప్రారంభమైంది. అసలు సినిమాలో సరుకు ఎంతుందో ఇప్పుడు ఇంటింటా తెలుస్తుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *