సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విక్టరీ వెంకటేష్ హీరోగా సంక్రాంతికి పాన్ ఇండియా సినిమాగా థియేటర్లలోకి వచ్చిన ‘సైంధవ్’ చిత్రం కనీసం 4 వారాల లిమిట్ అనే రూల్‌ని దాటి కాస్త ముందే ఓటిటి లో రిలీజ్ కానున్నది. తండ్రి కూతుళ్ళ ఎమోష్నల్ సెంటిమెంట్ కు క్రైమ్ జత చేసి హాలివుడ్ మేకింగ్ తో తీసిన ఈ సినిమా సంక్రాంతి సినిమాల మధ్యలో నలిగిపోయింది. కాస్త ఆగి సింగిల్ గా వచ్చి ఉంటె ..రిపోర్ట్ వేరేరకంగా ఉండేదని సినీవిశ్లేషకుల వాదన.. ఏది ఏమైనా… తాజాగా మేకర్స్ అధికారికంగా ‘సైంధవ్’ స్ట్రీమింగ్‌ని ప్రకటించారు. వచ్చే ఫిబ్రవరి 3న ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానుందని.. సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా పోస్టర్‌ను విడుదల చేసింది. ఇక థియేటర్లలో ప్రేక్షకులని మెప్పించలేకపోయిన ఈ సినిమా.. ఓటీటీలో మాత్రం దేశంలో అన్ని ప్రధాన బాషలలో కచ్చితంగా ఆదరణ పొందుతుందని మేకర్స్ భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *