సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సింపుల్ గా 70 రోజులు షూటింగ్ పూర్తీ చేసి, ఇంకా మినిమమ్ 40 కోట్ల బిజినెస్ తో సంక్రాంతి బరిలో భారీ సినిమాలతో పోటీకి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఈ పాన్ ఇండియా రోజులలో కేవలం తెలుగు వెర్షన్ లోనే చరిత్రలో ఏ హీరో సాధించలేని 300 కోట్ల పైగా కలెక్షన్ తో భారీ విజయం సింగిల్ హ్యాండ్ తో కొట్టేసారు విక్టరీ వెంకటేష్. దేశం యావత్తు నివ్వెరపోయింది ఓ ప్రాంతీయ బాషా సినిమా 300 కోట్లు వసూళ్లు పైన సాదించిందా? ఒక సినిమా కొన్నవారికి రూపాయి కి 6 రూపాయలు లాభమా? అని.. ఇంకా విజయవంతంగా ప్రదర్శించబడుతున్న ఈ సినిమా భీమవరం పట్టణంలో సైతం 2 కోట్ల కలెక్షన్ దిశగా అడుగులు వేస్తుంది. ఇది గతంలో వెంకీ ఎఫ్ 2 సినిమా సుమారు 1 కోటి 40 లక్షల కలెక్షన్ రికార్డు ను ఎప్పుడో అధిగమించింది. భీమవరం బుడోడు రేవంత్ బుల్లి రాజుగా తెలుగువారిని ఇంకా పడీపడీ నవ్విస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా? అని సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో జీ తెలుగు నేడు ఆసక్తికర ప్రకటన చేసింది. మార్చి 1న సాయంత్రం ఆరు గంటలకు టెలివిజన్ ప్రీమియర్‌గా ఈ సినిమా ప్రసారం చేస్తున్నట్లు ప్రకటించింది.. ముందు ఓటీటీలోనే వస్తుందని అందరూ అనుకున్నారు. అయితే సినీప్రియుల అంచనాలను తారుమారు చేస్తూ తాజాగా టెలివిజన్ ప్రీమియర్‌కు సంబంధించిన ప్రకటన వెలువడటంపై అందరూ షాక్ తిన్నారు.
