సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించిన ‘గామి’ సినిమా విభిన్న కధ , స్క్రీన్ ప్లై తో సాంకేతిక విలువలు తో అరుదయిన సినిమాగా ప్రశంసలు తో పాటు ఆర్ధికంగా విజయం సొంతం చేసుకొన్నా విషయం తెలిసిందే 6 ఏళ్ళు పాటు నిర్మించిన ఈ సినిమాలో విశ్వక్ ఇప్పటివరకు చేసిన సినిమాలకు భిన్నంగా, వైవిధ్యమైన కథాంశంతో ‘గామి’ సినిమా తెరకెక్కింది. భీమవరం పట్టణానికి చెందిన విధ్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మార్చి 8న థియేటర్స్‌లో విడుదలయింది. ఇప్పుడు ఈ సినిమాను ఓటిటి లో రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు.జీ 5 (ZEE 5) ఏప్రిల్ 12 నుంచి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కు తీసుకు వస్తున్నారు. థియేటర్లలో మిస్సయిన వారు ఇప్పుడు ఇంట్లోనే కుటుంబ సమేతంగా చూసి ఆనందించవచ్చు..
