సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల సంక్రాంతి పండుగకు అగ్ర దర్శకుడు శంకర్ , మెగా తనయుడు , సినీ హీరో రామ్‌ చరణ్‌ (Ram charan) కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer). 4 ఏళ్ళు పైగా నిర్మాణంలో 450 కోట్ల చిత్రం అంటూ .. దిల్‌ రాజు నిర్మాతగా సంక్రాంతి కానుకగా పాన్ ఇండియా సినిమాగా విడుదలైన ఈ సినిమా ఘోర పరాజయం చవి చూసింది. కనీసం 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ కూడా కష్టమైన ఈ సినిమాకు 400 కోట్లు వసూళ్లు.. అంటూ దిల్ రాజు వేసిన పోస్టర్ ఆయనను తీవ్ర విమర్శల పాలు చేసింది. అయితే నటుడుగా రామ్ చరణ్ ను అప్పన్న పాత్రలో ఒక మెట్టు పైకి ఎక్కించింది.భార్యగా అంజలి నటన మరో హైలైట్ భారీగా లావిష్ గ 75 కోట్లతో చిత్రించిన 5 పాటలు హైలైట్స్ గా చెప్పుకోవచ్చు.. ఇప్పుడు ఓటీటీ ద్వారా (OTT) ఆడియన్స్‌కు అలరించేందుకు సిద్థమైంది. అమెజాన్‌ ప్రైమ్‌ (Amazon Prime) వేదికగా ఫిబ్రవరి 7 నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. కియారా అడ్వాణీ కథానాయికగా నటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *