సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన సినిమా దసరా ఈ సినిమాతోనే శ్రీకాం త్ ఓదెల దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యా డు. అయితే ఓపెనింగ్ లలో వచ్చిన క్రెజ్.. సినిమా రన్ లో నిలబెట్టుకోలేకపోయింది. సోషల్ మీడియాలో ఓ మోస్తరు సినిమాను కూడా ఇటీవల 100 కోట్ల వసూళ్లు చేసిన సినిమాగా ? హైప్ చేస్తున్న విషయం తెలసిందే.. పాన్ ఇండియా సినిమా గా రిలీజ్ అయిన దసరా ను కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే పట్టించుకొన్నారు. హిందీలో అయితే చాల దారుణ పరాజయం. ఇక గోదావరి ఖని బొగ్గు గనుల నేపథ్యం లో మాస్ యాక్షన్ సినిమాగా నాని ,మాస్ హీరోగా రాణించే ప్రయత్నం చేసారు. మార్చి 30న శ్రీరామ నవమి సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఇప్పు డు ఓటీటీలో అలరించేందుకు రెడీ అయ్యింది. అందుతున్న సమాచారం ప్రకారం.. మే నెల లో దసరా సినిమా Netflix లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం . అయితే హిం దీ వెర్షన్ హక్కులను మాత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సాధించినట్లు తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *