సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మంచు విష్ణు హీరోగా ప్రభాస్, అక్షయ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు లు ప్రత్యేక అతిధి పాత్రలలో నటించిన పాన్ ఇండియా సినిమా కన్నప్ప సినిమా 50 కోట్ల పైగా వసూళ్లు తో పాటు మరో 35 -40 కోట్ల డిజిటల్ మార్కెట్ శాటిలైట్ ఇతరత్రా ఆదాయాలతో మంచి విజయం సాధించడమే కాదు.. నటుడుగా మంచు విష్ణు ను మరో మెట్టు పైన నిలబెట్టింది. తండ్రి కొడుకులుగా విష్ణు, శరత్ కుమార్ సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయి. రిలీజ్‌కు ముందు నిర్మాత హీరో విష్ణు ప్రకటించినట్లు రిలీజ్ అయ్యిన 50 రోజుల తరువాతే ఓటిటి లో రిలీజ్ కాబోతుంది. కన్నప్ప రిలీజ్ అయి హిట్టైన తర్వాతే కన్నప్ప సినిమాను ఓటీటీ సంస్థలకు బేరం పెడతానంటూ చెప్పాడు. అమెజాన్ ప్రైమ్ కన్నప్ప సినిమాను మంచి ఫ్యాన్సీ రేట్‌కు ఈ సినిమాను కొనుగోలు చేసినట్టు తెలస్తోంది. దీంతో ఈ సినిమా ఈనెల నాలుగో తేదీ నుంచి కన్నప్ప మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు హీరో మంచు విష్ణు నుంచి సోషల్ మీడియాలో అఫీషియల్ పోస్ట్ బయటికి వచ్చింది.
