సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హీరో ప్రభాస్ నేతృత్వంలోని ఎన్నో హిట్ చిత్రాలు నిర్మించిన ‘యూ వి క్రియేషన్’ బ్యానర్ ఫై సీనియర్ హీరోయిన్ అనుష్క , యువ హీరో నవీన్ పొలిశెట్టి కీలక పాత్రల్లో పి. మహేష్ బాబు దర్శకత్వంలో తెరకెక్కి న చిత్రం ‘‘మిస్ శెట్టి… మిస్టర్ పొలిశెట్టి’.ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఓ మోస్తరు విజయం అందుకొంది . ముఖ్యంగా అనుష్క నటన, నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్ సినిమాను నిలబెట్టినప్పటికీ ఈ సినిమా లో హీరోయిన్ పెళ్లి చేసుకోకుండా ఐయూఐ విధానం లో ఓ బిడ్డకు జన్మనివ్వా లనుకుంటుంది. దానితో కుటుంబ ప్రేక్షకులు థియేటర్స్ కు దూరం అయ్యారు. ఇక ఈ చిత్రం రిలీజ్ అయ్యి నెల తిరగకుండానే ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లెక్స్ లో ఈ అక్టోబరు 5వ తేదీ నుంచి తెలుగు, తమిళ, కన్న డ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *