సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు ప్రతిష్టాకర కాబినెట్ హోదా ఉన్న పీఏసీ చైర్మెన్ గా నేడు, శుక్రవారం మధ్యాహ్నం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. తొమ్మిది మంది పీఏసీ సబ్యులకు అదనంగా 10 వ సభ్యునిగా వైసీపీ నామినేషన్ వెయ్యడంతో ఏపీ అసెంబ్లీ చరిత్రలో తొలిసారి అసెంబ్లీ ఆర్థిక కమిటీల్లో (పీఏసీ) సభ్యుల ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమయింది. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించు కుంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీలోకి ఇంకా హాజరుకాలేదు. పీఏసీ సభ్యుల ఎన్నికలను వైసీపీ బాయ్‌కాట్ చేస్తోందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించడం మరో ట్విస్ట్.. అయితే ప్రజాపద్దులు(పీఏసీ (PAC), అంచనాలు(ఎస్టిమేట్స్), ప్రభుత్వ రంగ సంస్థల(పీయూసీ) కమిటీలకు పోలింగ్ జరుగుతోంది. అసెంబ్లీ కమిటీ హాలు లో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఏదైనా పార్టీ నుంచి ఒక సభ్యుడు ఎన్నికవ్వాలంటే ఆ పార్టీకి శాసనసభలో ఉండాల్సిన కనీస సంఖ్యాబలం 18. అయితే కేవలం 11 మంది సభ్యుల సంఖ్యాబలంతో మూడు కమిటీలకు ముగ్గురు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు నామినేషన్లు దాఖలు చేశారు. ఛైర్మన్లుగా పీఏసీకి పులపర్తి ఆంజనేయులు, అంచనాల కమిటీకి జోగేశ్వర రావు, పీయూసీకి కూన రవికుమార్‌ల ఎన్నిక దాదాపు ఖరారు చేశారు.
