సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రజాసేవలో అంకితభావంతో పనిచేసే ఎమ్మెల్యే అంజిబాబు లాంటి వ్యక్తికే సముచిత స్థానం రాష్ట్ర ప్రభుత్వం అందించిందని, ఆంధ్రప్రదేశ్ ప్రయివేట్ అండ్ ఆన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్ మెంట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు అక్కినేని కృష్ణకిషోర్, వైస్ ప్రెసిడెంట్ ఎంఎల్ఎస్ఎన్ రెడ్డి అన్నారు. నేడు, శనివారం భీమవరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా నియమితులైన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ను ఏపీ ప్రయివేట్ అండ్ ఆన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్ మెంట్ అసోసియేషన్ (అపుస్మా) జిల్లా సభ్యులు కలిసి అభినందనలు తెలిపారు. జిల్లాలో విద్యారంగానికి సంబంధించిన పలు విషయాలను తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే అంజిబాబుకు శాలువా కప్పి చిత్రపటంతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా సభ్యులు నరసింహరాజు, సెక్రటరీ వంశీ, కోశాధికారి ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.
