సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత్ ప్రస్తుతం.. కరువుకు ఆమడదూరంలో ఉన్న పాక్ ను ఆర్ధికంగా,నీటి వనరులకు అష్టదిగ్బంధం చేస్తుంది. ప్రపంచ బ్యాంక్ ఈ నెల 9న పాకిస్తాన్ కు వేలకోట్ల డాలర్స్ అప్పు ఇవ్వకుండా అడ్డుకొనే ప్రయత్నం చేస్తుంది. మీరు అప్పు ఇచ్చిన ఉగ్రవాద మూకలను పాక్ ఉగ్రవాద ముకలకు ఆయుధాలు కొనుగోళ్ళకు వాళ్ళను మేపడానికి ఉపయోగిస్తుందని వాళ్లకు రోడ్లు పరిశ్రమల అభివృద్ధి చేతకాదని ఇప్పటికే భారత్ వరల్డ్ బ్యాంకు కు పిర్యాదు చేసింది. కాశ్మిర్ లోని అమాయక హిందూ పర్యాటకుల ప్రాణాల తీసిన పాపానికి కాస్త ఆలస్యం అయినా పాక్ ఆక్రమించిన మన కాశ్మిర్ లోని పీవోకే భాగాన్ని భారత్ సైన్యం హస్తగతం చేసుకోవడం దాదాపు ఖాయమని ఇప్పటకే పాక్ కు అర్దమైయింది. ఎలాగూ గట్టిగ 2 వారలు పోరాడలేరు. అందుకే పీఓకే లోని దాదాపు 1000 మదర్సాలను మూసేశారు. అక్కడి ఉగ్రవాద కీలక నేతలను సురక్షిత ప్రాంతాలకు రహస్యంగా తరలిస్తున్నారు. యుద్ధం వస్తే.. పిల్లలకు అత్యవసర సేవల్లో శిక్షణ ఇప్పిస్తున్నారని తెలుస్తోంది. ఆయింట్‌మెంట్లు ఎలా రాయాలి, స్ట్రెచర్‌పై ఎవరినైనా ఎలా తీసుకెళ్లాలి, మంటలను ఎలా ఆర్పాలి లాంటివి నేర్పిస్తున్నారని సమాచారం. పాకిస్తాన్ అలెర్ట్ అయింది. నియంత్రణ రేఖ (LOC) వెంబడి ఉన్న PoKలోని 13 నియోజకవర్గాల్లో రెండు నెలల పాటు ఆహార సామాగ్రి, మందులను ని నిల్వ చేసుకోవాలని పాకిస్తాన్ పాలిత కశ్మీర్ ప్రధాన మంత్రి చౌదరి అన్వర్ ఉల్ హక్ గత శుక్రవారం అసెంబ్లీలోప్రకటించారు. దీనికి తోడు కాశ్మిర్ లో అభివృద్ధి తెలుసుకున్న POK లోని ప్రజలు కూడా తమను భారత్ లోని కాశ్మిర్ లో కలిపేయాలని గత 4 ఏళ్లుగా ఉద్యమిస్తున్నారు.
