సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన 3 ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు సోమవారం జరుగుతున్నా కౌంటింగ్ లో మొదటి ఫలితం ఇప్పుడే తాజగా ప్రకటించారు. మరో 2 స్థానాలలో కౌంటింగ్ జరుగుతుంది. ఓటర్లు చాల మంది సరైన అవగాహనా లేకుండా 1,2, 3 నెంబర్లు కు బదులు టిక్ లు పెట్టడం తదితర కారణాలతో ఏకంగా 20 శాతం కు పైగా ఓట్లు చెల్లుబాటు కాకుండా పోయాయని తెలుస్తుంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఉత్తరాం ధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. తెలుగు దేశం బీజేపీ జనసేన కూటమి బలపరిచిన ఏపీటీఎఫ్ అభ్యర్థి, ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మె ల్సీ రఘువర్మ పై ఆయన రెండో ప్రాధాన్యత ఓట్లతో మొత్తం 10,068 వేల మెజారిటీ తో గెలుపొందారు. దీనితో ఇటీవల ఉత్తరాంధ్ర లో జరిగిన 2 ఎమ్మెల్సీ ఎన్నికలలో మొన్న వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ గెలుపొందగా ఈ సారి కూడా ఎన్నికలలో పోటీ చెయ్యకపోయిన పరోక్షంగా వైసీపీ మద్దతు ఇచ్చిన పి ఆర్ టి యూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు గెలుపొందడం పి ఆర్ టి యూ నేతలు పడ్డ కష్టం, స్ఫూర్తి కూటమి నేతలకు ఒక రకంగా షాక్ గానే చెప్పాలి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *