సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవలప్రపంచాన్ని నివ్వెరపరిచే వరుస ఘనవిజయాలు సాధిస్తున్న భారత అంతరిక్ష ప్రయోగాల సంస్థకు దిష్టి తగిలినట్లు ఉంది. నేడు, ఆదివారం ఉదయం ఈవోఎస్-09 (రీశాట్-1బీ) ఉపగ్రహాన్ని పీఎ్‌సఎల్వీ-సీ 61 రాకెట్ నేడు నింగిలోకి మోసుకెళ్లే ప్రయోగం 3వ దశలో విఫలం అయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట షార్ అంతరిక్ష కేంద్రం నుంచి నేడు, ఆదివారం ఉదయం 5.59 గంటలకు ప్రయోగం నిర్వహించారు. అయితే ఆకాశంలోకి రివ్వున దూసుకొనిపోయిన రాకెట్ 2 దశలు బాగానే ఉన్నపటికీ 3వ దశలో లోపం తలెత్తడంతో విఫలం అయ్యింది. దేశ భద్రత, సైనిక అవసరాల కోసం రీశాట్-1బీ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఇది ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా అధిక రెజల్యూషన్‌తో కూడిన భూ ఉపరితల చిత్రాలు ( భారత్ సరిహద్దుల లోని )లభిస్తాయి. అయితే ప్రయోగం విఫలం అయిన మరోసారి విజయం సాధించడానికి శాస్త్రవేత్తలు సిద్ధం అవుతున్నారు
