సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఏమిటో? R R R కష్టాలు.. ఎట్టి పరిస్థితులలో ఒక్కయేడాదిలో షూటింగ్ పూర్తీ చేసి విడుదల చేస్తామన్న రాజమౌళి కరోనా ప్రభావంతో 2ఏళ్ళు ఇబ్బంది పడి, మొత్తానికి ఆయన మార్క్ లా 3 ఏళ్లకు అద్భుతంగా పూర్తీ అయ్యిందనిపించాక ఈ జనవరి 7న డేట్ ఫిక్స్ చేసాక.. పరిణామాలు పూర్తిగా మారిపోయాయి,దక్షిణాదిన సుమారు 1600 థియేటర్స్ ఉన్న ఏకైక రాష్ట్రము ఆంధ్ర ప్రదేశ్.. తెలుగు సినిమా కలెక్షన్స్ లో 70శాతం పైన ఇక్కడనుండే రావాలి. ఒకప్రక్క గతంలో పవన్ కళ్యాణ్ మమ్మల్ని, మా సినిమాలను ఏపీలో ఆపేదెవరు? అని ప్రశ్నిస్తే.. మొన్న సినిమా థియేటర్ నిర్మాతలు ప్రభుత్వంపై కోర్టుకు ఎక్కారు. (ఏపీలో థియేటర్స్ దాదాపు 90 శాతం హైదరాబాద్ లో నివాసం ఉంటున్న 5గురు అగ్ర నిర్మాతల లీజ్ లోనే ఉన్నాయన్నది బహిరంగ రహస్యమే.. ) ఇక అఖండ విజయం తరువాత అంత మంత్రుల చర్చలతో సర్దుకొంటుంది,, సంక్రాంతి వరకు వరుస సినిమాలతో కుమ్మేద్దాం అనుకొంటే.. నిన్న హీరో నాని ..ఏపీలో సినిమా టికెట్స్ తగ్గించి ప్రేక్షకులను అవమానించారు.. కిరాణా కొట్టు పెట్టుకొంటే బెటరు.. అని తీవ్ర వ్యాక్యలు చెయ్యడం తో రాష్ట్ర మంత్రులు భగ్గుమన్నారు. వెంటనే ఏపీ ప్రభుత్వం తన తడాఖా చూపించింది. థియేటర్స్ టికెట్ రేట్లుతగ్గించడమే కాదు..లైసెన్స్, కాంటీన్స్ అమ్మకాలు, సైకిల్ స్టాండ్, పార్కింగ్ , ఫైర్ సేఫ్ ఫై దృష్టిపెట్టడంతో.. అధికారుల దాడులు తో పలు సినిమా థియేటర్స్ సీళ్లు వెయ్యడం, స్వచ్చంధంగా మూసెయ్యడం వరకు వచ్చింది. దీనికి తోడు దేశవ్యాప్తంగా ఈ సినిమాల సంబరానికి ఒమిక్రాన్‌ కరోనా బ్రేక్‌ వేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్‌ క్రమంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో పలు ఉత్తరాది రాష్ట‍్రాలు రాత్రి పూట కర్ఫ్యూ కూడా విధించాయి. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా జనవరి 7 న రిలీజ్ నాటికి ఏపీలో థియేటర్స్ కొరత.. తగ్గింపు రేట్లు తో పాటు,మరికొన్ని రాష్ట్రాలు కూడా ఒమిక్రాన్‌ ఆంక్షలు విధించే అవకాశం ఉంది. దీంతో సినిమా వసూళ్లపై ప్రభావం పడే ఛాన్స్ కూడా ఉండొచ్చు. అందుకే దర్శక నిర్మాతలు సినిమాను వాయిదా వేసే అవకాశాలు లేకపోలేదు అని చర్చిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *