సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాజమండ్రి లో లోను యాప్ ల మాయలో పడి దారుణంగా నష్టపోవడమే కాకుండా వారి ద్వారా బ్లాక్ మెయిల్ కు గురిఅయ్యి , వారు తమ నగ్న మాఫింగ్ చిత్రాలను బయటపెడతారని భయంలో పరువు కోసం కొల్లి దుర్గారావు, రమ్య లక్ష్మి దంపతులు హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకొన్నా ఘటన రాష్ట్ర వ్యాప్తంగా అందరిని కలచివేసింది. ఈ విషయం తెలుసుకొన్న సీఎం జగన్ తీవ్రంగా స్వాందించారు. రిజర్వ్ బ్యాంకు అనుమతి లేని ఎటువంటి లోన్ యాప్ లపైనైనా ఇక అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. తల్లి తండ్రులను కోల్పోయి అనాధలయిన 4 ఏళ్ళ నాగసాయి 2 ఏళ్ళ లలితశ్రీ పిల్లలకు ఆర్ధిక సాయంగా వెంటనే చెరో 5 లక్షల రూపాయలు చప్పున 10 లక్షలు అందజేయాలని , వారి యోగక్షేమాలు పరిశీలించాలని జిల్లా కలెక్టర్ కే మాధవీలత కు ఆదేశాలు ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *