సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) వడ్డీరేట్లపై నేడు, బుధవారం తాజా నిర్ణయం ప్రకటించారు. వరుసగా 9వసారి కూడా వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు లేవని ప్రకటించింది ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయాలను వెల్లడించారు. రెపోరేట్, రివర్స్ రెపోరేట్‌లను మార్చకుండా 4 శాతం, 3.35 శాతానికి పరిమితం చేసినట్లు వెల్లడించారాయన. అలాగే ఎంఎస్‌ఎఫ్(మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ), బ్యాంక్ రేట్లను 4.25 శాతానికే పరిమితం చేసినట్లు తెలిపారు. పెట్రోల్ మరియు డీజిల్‌పై ఇటీవలి ఎక్సైజ్ సుంకం & రాష్ట్ర వ్యాట్ తగ్గింపులు.. కొనుగోలు శక్తిని పెంచడం ద్వారా వినియోగ డిమాండ్‌కు మద్దతు పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తం డిమాండ్‌కు మద్దతునిస్తూ ఆగస్టు నుంచి ప్రభుత్వ వినియోగం కూడా పుంజుకుంది.
