సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ప్రపంచ సినీ చారిత్రలో ఆస్కార్ తరువాత అంత ప్రతిష్టాత్మక అవార్డు గా భావించే ‘గోల్డెన్ గ్లోబ్’ (Golden Globe) అవార్డును మన తెలుగు సినిమా ‘ఆర్ఆర్ఆర్’ సొం తం చేసుకుంది. హాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో ప్రపంచ చిత్రాలతో పోటీ పడుతూ ఒరిజినల్ సాం గ్ విభాగానికి గానూ ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ‘నాటు నాటు’ పాటకు పురస్కా రం వరించింది. ఈమేరకు గత బుధవారం రాత్రి కాలిఫోర్ని యాలోని ది బెవర్లీ హిల్టన్ హాల్ వేదికగా జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్, కీరవాణి కుటుంబసమేతంగా పాల్గొని సందడి చేశారు. ‘నాటు నాటు’కు పురస్కారం ప్రకటించిన సమయం లో తారక్, రాజమౌళి, చరణ్.. చప్పట్లు కొడుతూ సందడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు బాగా హల్ చల్ చేస్తున్నాయి. సంగీత దర్శకుడు కీరవాణి అవార్డు తీసుకున్న అనంతరం మాట్లాడుతూ.. ‘‘గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందించిన హెచ్ఎఫ్పీఏకు ధన్యవాదాలు. సంతోష సమయాన్ని నా సతీమణితో పంచుకోవడం ఆనందంగా ఉంది. నా సోదరుడు రాజమౌళికి ఈ అవార్డు దక్కాలి.పాటలో భాగస్వామ్యమైన రాహుల్ సిప్లిగంజ్ ధన్యవాదాలు. నా శ్రమను, నాకు మద్దతు ఇచ్చిన వారిని నమ్ముకున్నాను. ఈ పాట విషయంలో నా కుమారుడు కాలభైరవ అద్భుత సహకారం అందించాడు’’ అని
తెలిపారు.
