సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రేపటి నుండి కోనసీమలోని ‘అంతర్వేది’ శ్రీ లక్ష్మీ నరసిం హస్వామి తిరునాళ్లు సందర్భంగా నరసాపురం మీదుగా వెళ్లే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంతర్వేది తిరునాళ్లు సందర్భంగా ఈ నెల 27 నుంచి ఫిబ్రవరి 2 వరకు జరిగే భక్తులకు ఇబ్బందులు లేకుండా చించినాడ వంతెనను తెరిచేందుకు కోనసీమ జిల్లా కలె క్టర్ ఆర్.మహే్‌ష్‌కుమార్ ఆదేశాలు జారీచేశారు. గతంలో ఒక పిల్లర్ కాస్త కృంగటం గమనించి రానున్న వేసవిలో మరమ్మతుల నిమిత్తం ఈ వంతెనను గత ఏడాది నవంబరులో మూసివేశారు. ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. అంతర్వేది తిరునాళ్ల సందర్భంగా వంతెనపై ఆర్టీసీ బస్సులు, 16 టన్నుల బరువుతో కూడిన వాహనాలనే అనుమతిస్తారు. అయితే లారీలు, స్కూల్, కాలేజీ బస్సులు, ఇతర వాహనాలను అనుమతించరు. దీనితో ఈ వారం ఆర్టీసీ బస్సులో అమలాపురం వెళ్ళవారికి కూడా దూరం తగ్గుతుంది.
