సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తీవ్ర అనారోగ్యం పాలయిన(మేడికల్ అన్ ఫిట్ )అయిన ఆర్టీసీ ఉద్యోగులకు నేడు, శుక్రవారం కూటమి ప్రభుత్వం (AP Govt) శుభవార్త చెప్పింది. 2020 జనవరి 1 తర్వాత మెడికల్ అన్ ఫిట్ అయిన ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఉద్యోగాలివ్వాలని నిర్ణయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ ఉద్యోగులను కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి విలీనం చెయ్యక ముందు మెడికల్ అన్ ఫిట్ అయిన డ్రైవర్లకు మాత్రమే ప్రత్యామ్నాయ ఉద్యోగాలిచ్చే విధానం ఉండదే. ఇకపై ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లు, సహా మిగిలిన ఉద్యోగులందరికీ, 21 కేటగిరీలో మెడికల్ అన్ ఫిట్ అయిన వారికి ప్రత్నామ్నాయ ఉద్యోగాలివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఆర్టీసీలో ఇచ్చే ఉద్యోగానికి అర్హత లేకపోతే ప్రభుత్వ విభాగాల్లో అర్హత బట్టి జిల్లా కలెక్టర్ల ద్వారా ఇతర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలివ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.దీనితో ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
