సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ను పాన్ వరల్డ్ సూపర్ స్టార్ ను చెయ్యడానికి భారతీయ సినీ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘SSMB 29’. ఈ సినిమాని సుమారు 1000 కోట్ల భారీ బడ్జెట్‌తో దుర్గ ఆర్ట్స బ్యానర్స్ (క్షణ క్షణం, హలొ బ్రదర్, దొంగాట…)లో కేఎల్ నారాయణ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కెన్యా లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా లకు సంబందించిన షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం. అయితే సీనియర్ నటి, ప్రియాంక చోప్రా అందరు అనుకున్నట్లు హీరోయిన్ కాదు విలన్ అని లీక్ చేసారు. మహేష్ సరసన మరో అంతర్జాతీయ అందాల ‘యంగ్’ హీరోయిన్ ను ఎంపిక చేసే పనిలో సినిమా యూనిట్ ఉంది. తాజాగా ఈ సినిమా రచయిత, దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు. అసలు మహేష్ బాబుతో ఈ కథనే ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరించారు. రాజమౌళి ఈసారి మహేష్ బాబు ను హీరోగా హాలీవుడ్ ప్రేక్షకులను కూడా టార్గెట్ చేసారు కాబ్బటి వారికీ, ఇండియన్ సినిమాలలో గతంలో ఎప్పుడు చూడనట్లు భారీ సినిమాను అందరికి నచ్చేటట్లు సాహసోపేతమైన ఎడ్వాంచర్స్ , థిల్స్ తో కూడిన సినిమా అయితే కరెక్ట్ అని భావించామని అందుకే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అంతర్జాతీయ నిపుణుల సహకారంతో షూటింగ్ చేస్తున్నామని వివరించారు.
