సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మరియు సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ( mahesh babu) హీరోగా ప్రియాంక చోప్రా , పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తోన్న SSMB29 చిత్రం దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై సుమారు రూ.1200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అదే స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా వేల కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టేలా 120 దేశాల్లో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రఖ్యాత హాలీవుడ్ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ తో SSMB29 టీమ్ ఒప్పందం చేసుకుందని టాక్ వినిపిస్తోంది. దీనిపై ఇప్పటికే వార్నర్ బ్రదర్స్ ప్రతినిధులు, రాజమౌళి టీమ్ మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. హాలీవుడ్ స్థాయిలో సాంకేతిక తో , సాధ్యమైనంత వరకు గ్రాఫిక్స్ కు దూరంగా సహజ అందమైన లొకేషన్ లతో, భయానక, అడవులలో శరవేశంగా జరుగుతోన్న షూటింగ్ జరుగుతుంది. ఇటీవలే కెన్యాలో షూటింగ్ పూర్తీ కాగా.. ఇప్పుడు హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన కాశీ సెట్‌లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఇందులో మహేశ్‌బాబు, ప్రియాంక చోప్రా సహా ప్రధాన తారాగణమంతా పాల్గొంటోంది. ఈ సెట్లో ఏకబిగిగా అక్టోబర్ 10 వరకు షూటింగ్ జరగనున్నట్లు సమాచారం.చియాన్ విక్రమ్ లేదా మరో సీనియర్ హీరో కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఫారెస్ట్ అడ్వంచర్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ” దైవం మానుషరూపేణ”అన్న టచ్ కూడా ఇవ్వబోతున్నాడు రాజమౌళి.అని తెలుస్తుంది.
