సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో ‘భవిష్య త్తుకు గ్యారంటీ’ చైతన్య బస్సు యాత్ర సందర్భంగా పాలకొల్లు ఎస్ కన్వె న్షన్ హాలులో ఎమ్మెల్యే రామానాయుడు అధ్యక్షతన జరిగిన సభలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ .. రాష్ట్రము జగన్ సారధ్యంలో అప్పులపాలయిందని , అభివృద్ధి లేదని విమర్శించారు. వైసిపి పాలన అంతా ప్రచార ఆర్బా టమేనని, ప్రజలకు ఈ విషయం ఇప్పటికే అర్ధం అయిందని విమర్శించారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ,మాజీ మంత్రి పితాని సత్య నారాయణ మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాలను అణచివేయడమే ధ్యేయంగా పాలన సాగుతుందన్నా రు. 54 కులాలతో కార్పొ రేషన్లను ఏర్పాటు చేసి పైసా ఇవ్వ కుండా దగా చేశారని విమర్శిం చారు. వచ్చే ఎన్నికల్లో అప్రజాస్వామికంగా గెలిచేందుకు జగన్ సిద్ధమవుతున్నాడని, తెలుగుదేశానికి ప్రజల మద్దతు ఉందని అయితే,కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. తెలుగుదేశానికి ప్రజల మద్దతు ఉందని, వచ్చే ఎన్నికల లో పోలింగ్ ముగిసి కౌంటింగ్ పూర్తీ అయ్యేవరకు ముగిసే వరకు ప్రతి కార్యకర్త నిద్రపోరాదని తెలిపారు.మాజీ ఎంపీ తోట సీతారామ లక్ష్మి, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్, మాజీ మంత్రులు పీతల సుజాత, గొల్లపల్లి సూర్యా రావు, జవహర్, ఉండి ఎమ్మె ల్యే మంతెన రామరాజు, ఎమ్మె ల్సీలు పంచుమర్తి అనురాధ, వేపాడ చిరంజీవి, దువ్వారపు రామారావు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామమోహన్ తదితరులు మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *