సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణం శివారు లోని కుముదువల్ల గ్రామాభివృద్ధికి పరితపిస్తూ పార్టీలకు అతీతంగా అందరికీ మంచి స్నేహితుడుగా ఉండే కుముడవల్లి గ్రామ టిడిపి అధ్యక్షులు సాగి మధుసూదన్ రాజు ఆకస్మిక మృతి తీవ్ర బాధాకరమని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు.నేడు, శనివారం సాగి మధుసూదన్ రాజు నివాసానికి వెళ్లి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మధుసూదన్ రాజు మృతి తెలుగుదేశం పార్టీకే కాకుండా నాకు దగ్గరి బంధువుగా తనకు వ్యక్తిగతంగా తీరని లోటు అన్నారు.ఆ కుటుంబాన్ని పరామర్శించిన వారిలో గ్రామ సర్పంచ్ భూపతి రాజు వంశీకృష్ణంరాజు, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు కలిదిండి వినోద్ వర్మ, కదిదిండి పవన్, నీటి సంఘం ప్రాజెక్ట్ చైర్మన్ కునాదిరాజు మురళి రాజు, గ్రామ పెద్దలు తదితరులు ఉన్నారు.
