సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో ఎమ్మెల్యే కోటా క్రింద 5 స్థానాలలో అభ్యర్థుల కేటాయింపు క్రింద కూటమి లో ఇప్పటికే జనసేన నాగబాబు ను బలపరిస్తే, బీజేపీ ఇంకా తమ అభ్యర్థిని అధికారికంగా సోము వీర్రాజు ను ఖరారు చేసింది. ఇక మిగతా 3 స్థానాలకు ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల నుండి ఒకొక్కరిగా చంద్రబాబు ఎమ్మెల్సీ ముగ్గురు అభ్యర్థులను ఖరారు చేశారు. తాజాగా ప్రకటించిన మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో రెండింటిని బీసీలకు కేటాయించింది. ఒక స్థానాన్ని ఎస్సీ మహిళకు ఇచ్చింది. వీరిలో బీటీ నాయుడు, బీద రవిచంద్ర యాదవ్, కావలి గ్రీష్మ ఉన్నారు. వీరిలో కావలి నియోజకవర్గానికి చెందిన బీద రవిచంద్రయాదవ్ టీడీపీకి తొలినుంచీ ఎంతో బాధ్యత గా అందరిని కొలుపుకొని పనిచేస్తున్నారు. ఇక 2015లో ఒకసారి టీడీపీ ఎమ్మెల్సీగా పనిచేసిన రవిచంద్రకు మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు.
