సిగ్మాతెలుగు డాట్. ఇన్ న్యూస్: కోడి పందాలసందడి దాదాపు ముగిసింది. అక్కడ అక్కడ అరకొర రహస్యంగా ఇంకా కొందరు నేడు, గురువారం కూడా పందాలకు సిద్దం అవుతునారు. ఇదిలా ఉండగా సంక్రాంతి కనుమ రోజు ప శ్చిమగోదావరి జిల్లాలో తొలిసారి తాడేపల్లి గూడెంలో ఏకంగా 1 కోటి 25 లక్షల భారీ కోడి పందెం కత్తులు కట్టకుండా పూర్తీ సాంప్రదాయ బద్దంగా డింకి పద్దతిలో జరగటం గమనార్హం ..సుదిర్గ సమయం . హోరా హోరీగా జరిగిన ఈ కోడి పందెంలో.. పందెం రాయుళ్లు భారీగా పందాలు కాశారు. తాడేపల్లిగూడెం కు చెందినా పైబోయిన వెంకట్రామయ్య కోడి పందెల బరిలో కోటి 25 లక్షల రూపాయలు పందెం వేశారు. గత పది రోజులుగా ఈ కోటి రూపాయల పందెం గురించి మీడియాలో తెగ వైరల్ అయింది.ఆసవాల్ ను స్వీకరించిన గుడివాడ ప్రభాకర్ రావు చెందిన నెమలి పుంజు, రంగాపురం రత్తయ్య రసంగి పుంజు ఈ బరిలోకి దిగాయి. ఈ పందాన్ని చూసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి సైతం పందెం రాయుళ్లు వందలాదిగా బరి వద్దకు వచ్చారు. పందెం మొదలు నుంచి ఆఖరి వరకు ఎంతో ఉత్కంఠగా కోడి పందెం సాగింది. పందెంలో చివరకు గుడివాడ ప్రభాకర్ రావు(నెమలి పుంజు)విజేతగా నిలిచింది. దాంతో వారందరూ బరి వద్దే పెద్ద ఎత్తున సంబరాలు జరిపారు. (ఫై చిత్రం లో విజేత పుంజు చూడవచ్చు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *