సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో మద్యం బార్ల ఏర్పాటుకు వ్యాపారులు దరఖాస్తులు వెయ్యడానికి ఆసక్తి చూపటం లేదు. దీనితో జిల్లాలో తాడేపల్లి గూడెం నరసాపురం, తణుకు, పట్టణాలలో మొత్తం 8 బార్లు ఏర్పాటుకు దరఖాస్తులు కోరగా.. గత గురువారం భీమవరంలోని కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ సీహెచ్ నాగరాణి లాటరీ నిర్వహించగా అందులో కేవలం మూడు బార్లకు మాత్రమే కేటాయింపులు జరిగాయి. డీఆర్వో బి.శివన్నా రాయణరెడ్డి, జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ అధికారి ఆర్వీ ప్రసాద్ రెడ్డి, సీఐలు కె.బలరామరాజు, కళ్యాణ్ చక్రవర్తి, రమేష్, మణికంఠ రెడ్డి, స్వరాజ్యలక్ష్మి పాల్గొన్నారు .
