సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఏలూరులోని ఎస్పీ కార్యాలయములో ఏలూరు ఎస్పీ రాహుల్దేవ్ శర్మ మహిళా దొంగల ముఠా కేసువివరాలను తెలియజేసారు, వివరాలలోకి వెళ్ళితే.. . ఏలూరు మండలం పోణంగి గ్రామానికి చెందిన తల్లిబోయిన కనకమ్మ గత నెల 18న ఆకివీడు వెళ్లేందుకు ఏలూరు కొత్త బస్టాండులో బస్సు కోసం వేచి చూస్తుండగా .. ఆమెను మాటలలలో పెట్టి మహిళా ఆగంతుకులు ఆమె చేతి సంచిని తెలివిగా కట్ చేసి అందులోని 36.5 సవర్ల బంగారు నగలను అపహరించారన్నారు. బాధితురాలి ఫిర్యా దు మేరకు ఏలూరు త్రీటౌన్ పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేసి దర్యా ప్తు చేపట్టారని తెలిపారు. చోరీకి పాల్పడిన తాడేపల్లిగూడెం, యాగర్లపల్లికి చెందిర రావాడ సత్యవతి, గెరక వరలక్ష్మి , ఎర్రసాని వరలక్ష్మి , ఎర్రసాని నాగవల్లి, ఏసమ్మలను గత మంగళవారం అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి బంగారు ఆభరణాలను రికవరీ చేశామని, వాటి విలువ రూ.15 లక్షలు ఉంటుందన్నా రు. అలాగే నూజివీడులో అపహరించిన 4 సవర్ల బంగారు ఆభరణాలనూ స్వాధీనం చేసుకున్నామని ప్రకటించారు. ప్రయాణాలు చేసేటప్పుడు ప్రయాణికులు అప్రమత్తత తో ఉండాలన్నారు.
