సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం,విజయదశమి రోజు మధ్యాహ్నం ఒంటి గంట తరువాత తెలంగాణ సీఎం కెసిఆర్ 21 ఏళ్ల టీఆర్‌ఎస్ ప్రస్థానంలో మరో కీలక మలుపు తీసుకొన్నారు. జాతీయ స్థాయి పార్టీ గా అవతరించేందుకు టీఆర్‌ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. టీఆర్‌ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ ఆ పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని కేసీఆర్ ఆమోదించారు. కొత్త పార్టీ బీఆర్‌ఎస్‌ను కేసీఆర్‌ అధికారికంగా ప్రకటించారు. పార్టీ జెండా, ఎజెండాపై టీఆర్ఎస్‌ నేతలకు కేసీఆర్ వివరించారు. ఈ తీర్మానాన్ని సమావేశం ముందు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రవేశపెట్టారు. టీఆర్‌ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు బలపర్చారు. ఈ భేటీలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. జెడ్పీ చైర్మన్లు సహా 283 మంది ప్రతినిధులు హాజరు అయ్యారు. టీఆర్ఎస్ పేరు మార్పుపై తీర్మానం చేశారు. అనంతరం సంతకాలు సేకరించారు. అయితే మరో నెలరోజుల పాటు సాంకేతిక కారణాలతో ఈసీ ఆమోదించే వరకు టీఆరెస్ పార్టీ పేరుతోనే మునుగోడు ఉప ఎన్నికలో టీఆరెస్ పోటీలోకి దిగుతుంది అని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *