సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి లో టీటీడీ బోర్డు ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా ప్రముఖ ప్రవచన కర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావును నియమిస్తూ హెచ్‌డీపీపీ కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకుందని చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి నేడు, శనివారం ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల కోసం టీటీడీ మూడేళ్లుగా వివిధ పారాయణాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వీలుగా ఈ నియామకం చేపట్టినట్లు పేర్కొన్నారు. తిరుపతిలోని పద్మావతి విశ్రాంతి గృహంలో చైర్మన్‌ ఆధ్వర్యంలో హెచ్‌డీపీపీ, SVBC tv కార్యనిర్వాహక కమిటీ సమావేశాలు గత శుక్రవారం జరిగాయి. గామీణ యువత భాగస్వామ్యంతో మారుమూల గ్రామాల్లో హిందూ ధర్మప్రచార కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *