సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీఎం జగన్ సరికొత్త పధకాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. ఈ కొత్త పధకం ద్వారా కొత్తగా పెళ్లి చేసుకునే పేద ఆడపిల్లల కుటుంబాలకు లబ్ది కలుగుతుంది. దీని ద్వారా 50 వేల రూపాయలు నుండి కులాంతర వివాహాలు చేసుకొంటే ఒక లక్ష 20 వేల వరకు పొందే ప్రయోజనాలు ఉన్నాయి. వైఎస్సార్ కళ్యాణమస్తు షాదీ తోఫా ను అక్టోబర్ 1వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అమలు చేస్తారు. ఆ రోజు నుంచి నవశకం లబ్దిదారుల మేనేజ్మెంట్ పోర్టల్ ద్వారా అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తారు.వివాహ తేదీ నాటికి వధువు వయస్సు 18, వరుడి వయస్సు 21 ఏళ్లు నిండి ఉండాలి. తొలి వివాహానికి మాత్రమే అర్హత. వధువు, వరుడు పదవ తరగతి పూర్తి చేసి ఉండాలి. (ఈ షరతుకు 2024 జూన్ 30 వరకు సడలింపు ఇస్తారు) వరుడు, వధువు ఇద్దరి కుటుంబాల ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు పది వేల రూపాయల్లోపు, పట్టణ ప్రాంతాల్లో 12 వేల రూపాయల్లోపు ఉండాలి. మూడు ఎకరాలకు మించి మాగాణి, లేదా పది ఎకరాలకు మించి మెట్ట భూమి ఉండరాదు. మెట్ట, మాగాణి రెండు కలిపి పది ఎకరాల్లోపు ఉండవచ్చు. కుటుంబాల్లో సభ్యులెవ్వరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో, ప్రభుత్వ సంస్థల్లో, ప్రభుత్వ ఉద్యోగిగా, పెన్షనర్ గా ఉండకూడదు. అయితే పారిశుధ్య కార్మికుల మినహాయింపు ఉంది.
