సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండల ఎంపీపీ అయిన వైసీపీ కీలక నేత పేరిచెర్ల నరసింహ రాజుని YSRCP పార్టీ అధినేత జగన్ ఆదేశాలతో తాజగా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంటు)గా నియమించిన నేపథ్యంలో నేటి గురువారం ఉదయం నరసింహరాజు స్థానిక గునుపూడిలో ఉన్న రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజుని ఆయన క్యాంప్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మోషేను రాజు నరసింహరాజు ను అభినందిస్తూ మరిన్ని ఉన్నత పదవులు పొందాలని శుభాకాంక్షలు తెలిపారు
