సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం జనసేన ఎన్నికల కార్యాలయంలో నేడు, గురువారం స్థానిక 20వ వార్డ్ కు చెందిన జనసేన,టీడీపీ,బీజేపీ కార్యకర్తలు తమ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) 1ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నేత, కేంద్ర పార్టీ కోశాధికారి అయిన మెంటే పార్ధ సారధి కూడా పాల్గొనడం జరిగింది. ఇరువురుకి శాలువాలు తో స్థానిక నేతలు సత్కరించడం జరిగింది. ఈ సందర్భముగా అంజిబాబు మాట్లాడుతూ.. ఎన్నికల్లో తన కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసారు. టీడీపీ. జనసేన బీజేపీ పార్టీలలోని ప్రతి కార్యకర్తలకు కష్టాల లో అండగా ఉంటానని నిత్యం అందరికి అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కౌన్సిలర్ మెంటే గోపి, టీడీపీ మైనారిటీ నేతలు తదితరులు పాల్గొన్నారు.
