సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈ మార్చి నెలతో ప్రస్తుతి ఆర్ధిక సంవత్సరం ముగియనుంది. కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి కీలక మార్పులు(Financial year ) దేశవ్యాప్తంగా రానున్నాయి. కొత్త ఇన్‌కమ్‌ ట్యాక్స్ చట్టం, లేబర్ కోడ్స్, బడ్జెట్ ప్రతిపాదనలు, రైల్వే టికెట్ క్యానిలేషన్ రూల్స్‌(new-rules) మారనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 అమల్లోకి రానుంది. పన్నులు, పన్న శ్లాబులు మాత్రం అలాగే కొనసాగనున్నాయి. ఇప్పటిదాకా పాన్ కార్డు పొందాలంటే ఆధార్ కార్డు ప్రూఫ్‌గా చూపించాలి. కానీ ఇప్పుడు ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, బర్త్ సర్టిఫికేట్ లాంటివి కూడా ఇవ్వాల్సి ఉంటుంది.ఫ్యూచర్స్‌పై సెక్యూరిటీస్‌ లావాదేవీల పన్ను (STT) 0.02 శాతం నుంచి 0.05 శాతానికి పెరగనుంది. అలాగే ఆప్షన్స్‌ ప్రీమియం, ఆప్షన్స్‌పై STT 0.01 శాతం నుంచి వరుసగా 0.15శాతం, 0.125 శాతానికి పెరగనుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ అకౌంట్‌లో రూ.10 లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ నగదు ఒకేసారి లేదా విడతల వారీగా జమచేసినా లేదా ఉపసంహరించుకున్నా పాన్ వివరాలు సమర్పించాలి. (ప్రస్తుతం రూ.50 వేలు దాటితేనే పాన్ వివరాలు అడుగుతున్నారు.) రైలు ప్రయాణానికి 8 గంటల లోపల టికెట్‌ను రద్దు చేస్తే రిఫండ్ రాదు. ఇంతకుముందు ఇది 4 గంటలే ఉండేది. రైలు బయలుదేరడానికి 24 గంటల ముందు నుంచి 8 గంటల మధ్య టికెట్‌ రద్దు చేసుకుంటే 50 శాతం, 72 నుంచి 24 గంటల మధ్య రద్దు చేసుకుంటే 25 శాతం మొత్తం మినహాయిస్తారు. రైలు బయలుదేరేందుకు 72 గంటల సమయం ఉండగా టికెట్లు ఎప్పుడు రద్దు చేసుకున్నా కూడా క్యాన్సిలేషన్ రూసుము మినహాయిచి మిగిలిన మొత్తం రిటర్న్ వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *