సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్నికలు సమీపిస్తున్న వేళా జనసేన ను మరింత బలోపేతం చేసే దిశగా పవన్ అడుగులు వేస్తున్నారు. చాపక్రింద నీరులా రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ కాపు నేతలు సంఘటితమౌతున్నారు. తెలుగు దేశం తో పొత్తు తో జనసేన ఒకవేళ అధికారంలోకి వస్తే తమకు రాష్ట్రంలో ఉన్న బలమైన ఓట్ల శాతానికి అనుగుణంగా రాజ్యాధికారంలో బాగస్వామయం దక్కాలని వారు తప్పిస్తున్నారు. అందువల్ల వ్యక్తిగత పార్టీల విభేదాలు ప్రక్కన పెట్టి జనసేన ను బలపర్చడానికి ముందుకు వస్తున్నారు. ఇతర పార్టీల నుండి వస్తున్నా ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు, మాజీ మంత్రి వేదవ్యాస్ లాంటి నేతలతో పాటు ఊహించని విధంగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా జనసేన లో చేరుతారని అందుకు పవన్ కళ్యాణ్ స్వయంగా అతి త్వరలో ముద్రగడ ఇంటికి వెళ్లి ఆయనను మరియు ఆయన కుమారుడు చంటిబాబు ను జనసేనలోకి ఆహ్వానిస్తారని సమాచారం.ముద్రగడ కుటుంబం చంద్రబాబు హయాంలో ఎన్నో ఘోర అవమానాలు భరించిందని..పవన్ కళ్యాణ్ ఫై సైతం పోటీ కి సవాల్ విసిరిన ముద్రగడ, మరి టీడీపీ తో పొత్తు ఉన్న జనసేన లో చేరితే నిజంగా అందరికి ఊహించని షాకే .. పవన్ కళ్యాణ్ జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ‘జనసేనానితో గ్లాసు టీ’ కార్యక్రమం నిర్వహించారు. ఇదిలా ఉండగా.. ఈ కార్యక్రమంలో పవన్, యువతీ యువకుల ఆలోచనలు విన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ‘ ఏపీలో నేరమయ వైసీపీ పాలన ను ఎదుర్కొనేందుకు నాకు శక్తివంతమైన యువ సమూహం అండగా ఉంది. నాకు నిరంతరం వెన్నంటి ఉండేది యువత బలమే. సగటు మనిషి ఆవేదనలు తీర్చాలంటే చట్టసభల్లో మన గొంతు బలంగా వినబడాలి. యువతరానికి కచ్చితంగా నేను పూర్తి స్థాయిలో అండగా నిలిచే బాధ్యత తీసుకుంటాను’’ అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *