సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో అతి పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించిన సీఎం జగన్ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ.. సమ సమాజ స్థాపన పేదలకు బడుగులకు రాష్ట్రంలో ఉన్నత వర్గాలతో పోటీ పడేవిధంగా సమాన అవకాశాలు కలిపిస్తూ ఆంధ్ర ప్రదేశ్ అంబేద్కర్ ఆశయ సాధనలో ముందుఉందన్నారు. అయితే ఇక్కడ చంద్రబాబు తో పాటు వాళ్ళ పెత్తం దారుల పత్రికలు చరిత్రను కూడా వక్రీకరిస్తున్నాయని.. ఎల్లోమీడియాను చూస్తే పాత్రికేయం ఏ స్థాయికి దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. పేదవాడి పిల్లలు ఎప్పటికీ పనివాళ్లుగా ఉండిపోవాలా? అంటూ ప్రశ్నించారు.‘‘పేదలు చదివే ప్రభుత్వ స్కూళ్లను పట్టించుకోకపోవడం అంటరానితనమే. పేదలకు ఇళ్లు ఇస్తుంటే అడ్డుకోవడం కూడా అంటరానితనమే. పేదపిల్లలకు ఆధునిక విద్య కోసం ట్యాబ్లు ఇస్తుం టే కుట్రపూరిత వార్తలు రాయడం అంటరానితనమే. దళితులకు చంద్రబాబు సెంటు భూమి కూడా ఇచ్చింది లేదు. బీసీ, ఎస్సీ , ఎస్టీలపై చంద్రబాబుకు ఏ కోశానా ప్రేమలేదు. మన ప్రభుత్వం బడుల రూపురేఖలు మారిస్తే పెత్తం దారులకు నచ్చడం లేదు. అంబేద్కర్ భావజాలం పెత్తందారులకు నచ్చదు’’ అని సీఎం జగన్ విమర్శించారు.
‘‘

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *