సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చంద్రబాబు అవినీతిని వెనకేసుకొనివస్తున్న పురంధరేశ్వరి బీజేపీ రాష్ట్ర అడ్జక్షురాల? లేక టీడీపీ లో చేరిపోయారా? అని ప్రశ్నించిన వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి ఫై,… నేడు, బుధవారం విజయవాడలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అదానీ మద్యం కంపెనీ వెనుక ఎంపీ విజయసాయి రెడ్డి ఉన్నారని ఆ కంపెనీ ప్రయోజనాల కోసం పని చేస్తున్నారని విమర్శించారు. ఏపీ బెవరెజెస్ కార్పోరేషన్ వద్ద 100కు డిస్టలరీ కంపెనీల నమోదయ్యాయని, కానీ 74 శాతం మద్యం సరఫరాను కేవలం 16 కంపెనీలే చేస్తున్నా యన్నారు. అదాన్ డిస్టలరీస్ 2019లో మొదలైందని, రూ. 1164 కోట్ల మేర మద్యం సరఫరా ఆర్డర్ అదాన్ కంపెనీకే ఉన్నాయన్నారు. అదాన్ కంపెనీ వెనుక ఎంపీ విజయసాయి రెడ్డి ఉన్నారని, ఈ రెండు కంపెనీలను అదాన్ బలవంతంగా చేజిక్కించుకుందని ఆమె ఆరోపించారు. చింతకాయల రాజేష్ , పుట్టా మహేష్ వంటి వారికి చెందిన సంస్థలను బలవంతంగా అదాన్ కంపెనీ చేజిక్కించుకుందని తీవ్రంగా ఆరోపించారు.
