సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సంక్రాంతి పండగకు కుటుంబ సమేతంగా తన స్వగ్రామం నారావారిపల్లె వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. నేడు, మంగళవారం స్థానిక టీడీపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ” వ్యవసాయంలో పెనుమార్పులు వస్తున్నాయి. ప్రపంచ దేశాలన్నీ ప్రకృతి సేద్యం వైపు చూస్తున్నాయి. ప్రకృతి సేద్యం అన్ని వేళలా ఆదాయం ఇస్తుంది. గత ఐదేళ్లుగా బిందు సేద్యం పడకేసింది. మనం తినే ఆహారం ఎలాంటిదో తనిఖీ చేసుకునే అవకాశం వచ్చింది. అందుకే అందరూ హార్టికల్చర్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. డెయిరీలో ఆదాయం పెరిగింది. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెరిగిపోయింది. సేంద్రియ సాగుకు నేనే శ్రీకారం చుట్టాను వాట్సాప్ గవర్నెన్స్‌కు శ్రీకారం చుట్టబోతున్నాం. భవిష్యత్తులో సెల్ ఫోన్ మీకు ఆయుధంగా పని చేస్తుంది.ఈ ఏడాది గోదావరి, కృష్ణా నదీ జలాలు దాదాపు 6వేల టీఎంసీలు సముద్రంలో వృథాగా కలిసిపోయాయని, వాటిలో కేవలం 350 టీఎంసీలు మాత్రమే వాడుకోగలిగారని, ఆయన చెప్పారు. తెలుగు వాళ్లు అమెరికాలో అమెరికన్ల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. అదే పరిస్థితి ఇక్కడ రావాలి. నేను అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలోనే ఉన్నా ప్రజల కోసమే పని చేస్తున్నా అన్నారు.
