సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం తన స్వంత నియోజకవర్గం కుప్పంలో పలు శంకుస్తాపనలు ప్రారంబోత్సవాలులో పాల్గొన్న సీఎం చంద్రబాబు కుప్పం లోని తన నివాసంలో ఉమ్మ డి చిత్తూరు జిల్లా మామిడి రైతులు, పల్ప్ పరిశ్రమల ప్రతినిధులు, ప్రాసెసింగ్యూనిట్లతో సమావేశం నిర్వహించారు . సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఇటీవల ఎగుమతులు లేక ధర తగ్గిపోయిన మామిడి రైతుల నుంచి తక్షణం మామిడి కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలని ప్రాసెసింగ్, పల్ప్ పరిశ్రమలను ఆదేశించారు. అదే సమయంలో పండ్ల పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్స్ ను కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. కొందరు మామిడి రైతులను ప్రభుత్వం ఫై రెచ్చ గొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని రైతులు వారి మాయలో పడొద్దన్నారు చంద్రబాబు. మామిడి రైతులకు భవిష్య త్తులోనూ ఎలాంటి సమస్యా లేకుండా ప్రభుత్వం వైపు నుంచి కార్యాచరణ చేపడతామని సీఎం భరోసా ఇచ్చారు.
