సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వారాహి యాత్ర ముగింపు దశగా పవన్ కళ్యాణ్ భీమవరం చేరుకోవడం .. గత రాత్రి నరసాపురం బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ.. భీమవరం ,గాజువాక లో ఓడినప్పుడు తాను ఎంతో గుండె కోతకు గురి అయ్యానని.. ప్రజలు మంచివారిని గెలిపించకుండా ఇటువంటి వారినా? గెలిపించేది? అని బాధ పడ్డానని, పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ లోనే రౌడీ నేతలు, క్రిమినల్స్ ఉన్నారని..ఇక వారిని సహించనని అంటూ తనదైన భాషలో హెచ్చరించిన నేపథ్యంలో.. భీమవరం ఎమ్మె ల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పవన్ పార్టీ చంద్రబాబు ప్రయోజనాలకోసం పెట్టారని అందరికి తెలుసునని, తనకు ఓట్లు వెయ్యలేదని పవన్.. కాపులను తీవ్రంగా అవమానిస్తున్నారు.. ఇక్కడ పోటీ చేసాడే తప్ప భీమవరం లోని ఓటర్లు ఎంత మంది ఉంటారు? ఎన్నిక విధానం కూడా పవన్ కల్యాణ్‌కు తెలియదని విమర్శించారు.. ఇక, సినిమా వాళ్లని చూడాలని ప్రజల్లో ఆదరణ ఉంటుంది.. యాంకర్’ అనసూయ రాజమండ్రి వచ్చిన జనం కిక్కిరిసిపోతారంటూ కామెంట్ చేశారు.. గోదావరి జిల్లాలో రౌడీఇజం అనేది పెద్ద జోక్ అంటూ .. గతంలో చిరంజీవి కూతురు శ్రీజ తన బాబాయ్ వల్ల ప్రాణహాని ఉందని చెప్పిన విషయం, ఆ సమయంలో గన్ పట్టుకుని పవన్.. రౌడీగా వ్యవహరించిన తీరు ప్రజలు మర్చిపోలేదని అన్నారు… పీక నొక్కే యడం, గుడ్డలు ఊడదీసికొట్టడం , మక్కెలు ఇరగదీయడం .. ఇవే పవన్ కల్యాణ్ మేనిఫెస్టో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ని, రాష్ట్రంలో జరుగుతోన్న అభివృద్ధి పనులు పవన్ కల్యాణ్.. చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. గత 2019 ఎన్నికల్లో గోదావరి జిల్లాలలో ప్రజలు జనసేనకు విముక్తి పలికారు అంటూ ఎద్దేవా చేశారు. జనసేన సీట్ల కోసం చంద్రబాబుని బ్లాక్ మెయిల్ చేయడానికే పవన్ వారాహి యాత్ర చేపట్టారు అంటూ ఆరోపించారు.. గోదావరి జిల్లాలో రౌడియిజం , గుం డాయిజం చేసేది.. ఎవరో ప్రజలకు గుర్తు ఉందని.. గతంలో భీమవరం నుండి ఆడ పిల్లలతో వెళుతున్నహిరో రాజశేఖర్, జీవితలపై రౌడీయిజం వారిని వేటాడింది ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలుసు అంటూ .. అటువంటి పవన్ లాంటి వ్యక్తులను ప్రజలు ఎలా నమ్ముతారని? ప్రశ్నించారు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్..
