సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నందమూరి బాలకృష్ణ ‘భగవంత్ కేసరి సినిమా దసరా పండగ సందర్భంగా నేడు, గురువారం విడుదలైంది అఖండ’ ‘వీరసింహారెడ్డి‘ వరుస సినిమాలతో విజయాల బాటలో వున్న బాలకృష్ణ ఈసారి వరుసగా 6 హిట్స్ సినిమాలు తీసిన అగ్ర దర్శకుడు అనిల్ రావిపూడితో కలసి ‘భగవంత్ కేసరి’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో కాజల్ అగర్వాల్ కథానాయిక కాగా శ్రీలీల ,శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించగా , బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఇందులో విలన్ గా నటించారు. మరి ఈ సినిమా కధ విషయానికి వస్తే.. భగవంత్ కేసరి (బాలకృష్ణ) వరంగల్ జైల్లో ఖైదీగా ఉంటాడు, ఆ జైలుకు జైలర్ గా శ్రీకాంత్ (శరత్ కుమార్) అనే అతను వుంటాడు. భగవంత్ తల్లి (జయచిత్ర) చావు బతుకుల మధ్య వున్నప్పుడు ఆమె చివరి కోరికగా కొడుకుని చూడాలని కోరుకుంటుంది. జైలర్ శ్రీకాంత్ జైలు రూల్స్ బ్రేక్ చేసి భగవంత్ ని తల్లి దగ్గరికి తీసుకు వెళతాడు, అందువలన శ్రీకాంత్ ని సస్పెండ్ చేస్తారు అధికారులు. అయితే శ్రీకాంత్ వెళ్ళేముందు ఆగస్టు 15 న సత్ప్రవర్తన కారణంగా విడుదల చేసే ఖైదీల పేర్లలో భగవంత్ కేసరిని కూడా చేరుస్తాడు, దానితో భగవంత్ ని రిలీజ్ చేస్తారు. విలన్ కుట్రకు శ్రీకాంత్ బలవుతాడు. జైలు నుంచి బయటకి వచ్చాక జైలర్ కూతురు ( శ్రీలీల ) ను తాను పెంచుకొంటూ .. పాపే తన జీవితం అని బతుకుతున్న అతనికి మళ్ళీ విలన్ తారసపడతారు, అప్పుడు వాళ్ళిద్దరి మధ్య వుండే పాత పగలు బయటకి వస్తాయి. ఇక ఇదీ పాత కథే .. అయితే అనిల్ రావిపూడి రచన, భావోద్వేగ సన్నివేశాలు, కథనం ఇలా ఈ సినిమాని నడిపిస్తాయి. ఈ సినిమాలో బాలకృష్ణని అతని వయసుకి తగ్గ పాత్రలో చూపించటం. ఆయనకు పెద్దగా అరిచే డైలాగులు, కేకలు, తొడగొట్టడాలు పెట్టకపోవడం పెద్ద రిలీఫ్.. పంచ్ డైలాగ్స్ మాత్రం అభిమానులకు సరిపడా చాలానే వున్నాయి. అయితే వినోదానికి సెంటిమెంట్ కలపి మొదటిసారి బాలకృష్ణని ఒక విభిన్నమైన, పాత్రలో చూపించి మెప్పించగలిగాడు అనిల్ రావిపూడి. రెండో సగంలో మళ్ళీ బాలకృష్ణ, శ్రీలీల మధ్య వచ్చే సన్నివేశాలు భావోద్వేగాలతో బాగా కుదిరాయి. కాజల్ కామిడి చేసింది. అలాగే పాత ఎన్టీఆర్ సినిమాలో పాట ‘కళ్ళలో కళ్ళు పెట్టి చూడు’ నేపథ్యంలో బస్సులో తీసిన పోరాట సన్నివేశం అలరిస్తుంది, 3 పాటలు బాగుంటాయి. అయితే పక్క మాస్ సినిమా మాత్రం కాదు.. తమన్ సంగీతం బాగుంది. సినిమా అన్ని రకాలుగా ఓకే.. మరి దసరా పండుగ రోజులు అయ్యాక ప్రేక్షకుల తీర్పు తెలుస్తుంది.
