సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కాకినాడ జిల్లా లో దేశవ్యాప్తంగా పవిత్ర పుణ్య క్షేత్రంగా భాసిల్లుతున్న అన్నవరం కొండపై దేవాలయం అనుకోని పడమర రాజ గోపురం ఎదురుగా గల దుకాణల్లో చెలరేగిన మంటలు దేవాలయ సిబ్బంది తో పాటు భక్తులలో ఆందోళన రేకెత్తింది. నేటి శుక్రవారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సెర్క్యూట్ కారణంగా ఫాన్సీ షాప్ గౌడౌన్లో చెలరేగిన మంటలు. వరుసగా ఉన్న ఏటిఎం, టీ టైం, జ్యూస్ పాయింట్.. చెప్పులు స్టాండ్ షాపులోకి వ్యాపించిన మంటలు. ఫాన్సీ షాప్ గౌడౌన్లో లక్షలాది రూపాయల విలువైన సరుకు బూడిద పాలైంది. హుటా హుటిన దేవాలయ సిబ్బంది తో పాటు తుని ఫైర్ స్టేషన్ సిబ్బంద మంటలను అదుపులోకి తెచ్చారు.
