సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆషాడ మాసం లో అన్నవరం స్వయం భువుడు శ్రీ సత్యదేవుడి దర్శనం కోసం భక్తులు విశేషంగా వస్తున్నారు. ఇక అక్కడి ప్రసాదాల రుచి దేశం అంతటికి తెలుసు.. అందుకే ఆషాఢమాసంలో ఇక్కడికి సమీపంలోని కొండపై కొలువున్న తలుపులమ్మ లోవ దేవస్థానానికి భక్తులు అధికంగా తరలివెళుతుంటారు. తిరుగు ప్రయాణంలో వారంతా సత్యదేవుడి స్వామివారి ప్రసాదాలను కొనుగోలు చేసుకుని తమ స్వస్థలాలకు వెళ్లి బంధుమిత్రులకు పంచుతుంటారు. ఆ నేపథ్యంలో ఆషాఢమాసంలో 10 లక్షల పైగా ప్రత్యేక ఆకుతో ప్యాక్ చేసిన ప్రసాదాల విక్రయాల ద్వారా స్వామివారి ఖజానాకు రూ.2 కోట్ల పైగా ఆదాయం వస్తుంది అని అంచనా. ఈ ప్రసాదం విక్రయాలు ప్రతి ఆది వారం, మంగళవారం, గురువారాల్లో మాత్రమే అధికంగా ఉంటాయి. వీటి కోసం దేవస్థానం యంత్రాంగం అన్నవరం జాతీయ రహదారిపై ఉన్న రెండు నమూనాలయాలు, తొలిపావంచా వద్ద అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రసాదాలు అందుబాటులో ఉంచారు. .
