సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అంచెలు అంచెలుగా పలు శాఖలుగా విస్తరించిన ప్రఖ్యాత ఆదిత్య ఫార్మసీ ఎం డీ నరసింహమూర్తిరాజు నేడు, శనివారం ఆత్మహత్య కు పాల్పడ్డారు. విజయవాడ లోని అయోధ్యనగర్ క్షత్రియభవన్లో ఆయన ఆత్మహత్య చేసుకొన్నట్లు అయన సన్నిహితులు గుర్తిం చారు. గతే డాది స్నేహితుడి హత్య కేసులో నిందితుడిగా ఉన్న నరసింహమూర్తిరాజు ..ఇటీవల బెయిల్ ఫై బయటకు వచ్చి కొద్దీ రోజులే అయ్యింది. ఊహించని రీతిలో ఆయన అనూహ్యంగా ఆత్మహత్య కు పాల్పడ్డారు. గదిలో ఆయన సూసైడ్ నోట్ ఉన్నట్లు భావిస్తున్నారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. ఆత్మహత్యకు గల కారణాలపై కేసు దర్యాప్తు చేస్తున్నారు.
