సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇంకా ఏపీలో ఎన్నికలకు ఏడాది కాలం ఉన్నప్పటికీ డిసెంబర్ లో ముందస్తు ఎన్నికలు వస్తాయనే ఊహాగానాలతో ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ లు జనం మధ్యలోకి వెళ్లిపోగా.. ఇప్పటికే చాల ఆలస్యం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ నెల 14 నుండి గోదావరి జిల్లాలలో ప్రచారం ప్రారంభించనున్నారు. అయితే తన పర్యటనలో జనసేన తో టీడీపీ పొత్తు పెట్టుకొంటే కేటాయిస్తారని భావిస్తున్న సీట్లు లక్ష్యంగా పవన్ ఎన్నికల ప్రచార శంఖారావం పూరించనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వారాహి వాహనం ఫై ఈనెల 14న అన్నవరానికి రానున్నారు. అక్కడ సత్యదేవుడిని దర్శించుకొని పూజలు అనంతరం సాయంత్రం కత్తిపూడిలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి కాకినాడ, కాకినాడ రురల్, పిఠాపురం, ప్రత్తిపాడు, ముమ్ముడివరం అమలాపురం, రాజోలు నియోజకవర్గంల మీదుగా పర్యటిస్తారు. తదుపరి పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం, పాలకొల్లు (ఇదొక్కటే టీడీపీ సిటు జనసేనకు కేటాయించే అవకాశం లేదు) మీదుగా పర్యటించి జిల్లా కేంద్రం, తాను గతంలో పోటీ చేసిన భీమవరం తో తోలి ప్రచార యాత్ర పూర్తీ చేస్తారు. దీనిలో భాగంగా ఒక్కో నియోజకవర్గంలో రెండు రోజుల పాటు పవన్‌ వారాహి యాత్ర కొనసాగనుంది. ప్రతి రోజు ఉదయం బస చేసిన ప్రాంతంలో స్థానిక సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *