సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం ఉదయం ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తూ.. జగన్ సర్కార్ పాలన విధానాలను ప్రశంసించారు. ఏపీలో జగన్ సర్కార్ పేదలకు ఇస్తున్న సంక్షేమం, పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి ఉచిత విద్య, వైద్యం ఇతర పాలనా విధానాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి అన్నారు. దీనికి ప్రతిగా పసుపు కండువాలు వేసుకుని టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ తప్పు.. తప్పు అంటూ నినాదాలు చెయ్యడం తో వారిపై గవర్నర్ ఒక దశలో అసహనం వ్యక్తం చేసారు. చివరకు గవర్నర్ ప్రసంగం జరుగుతుండగానే టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అబద్దాలు వినలేకపోతున్నామంటూ టీడీపీ సభ్యులు సమావేశాల నుంచి బయటకు వచ్చేశారు. బయటకు వచ్చిన అనంతరం టీడీపీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. పాలకొల్లు ఎమ్మెల్యే తెలుగుదేశం శాసనసభ పక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. జగన్ పాదయాత్రలో చెప్పిన అబద్దాలు లాంటివే అసెంబ్లీలో గవర్నర్ చేతా పలికించారన్నారు. ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజల్ని మోసగించటానికి గవర్నర్‌ను కూడా సీఎం జగన్ వాడుకోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా బీఏసీని కూడా బహిష్కరించామని నిమ్మల రామానాయుడు తెలిపారు.
