సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం ఉదయం ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. అధికారం పక్షం తరపున సిఎం జగన్ తో పాటు ప్రతిపక్షం తరపున చంద్రబాబు హాజరు కాకపోవడంతో అచ్చేమ్ నాయుడు సభలో పాల్గొన్నారు.అసెంబ్లీ స్పీకర్ తమినేని సిసీతారాం., శాసనమండలి చైర్మెన్ కొయ్యే మోషేను రాజు ల నడుమ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తూ.. జగన్ సర్కార్ పాలన విధానాలను ప్రశంసించారు. విజ‌య‌వ‌డ‌లో 18.8 ఎక‌రాల్లో ప్రపంచంలో ఎత్తైన 206 అడుగుల డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ విగ్రహాన్ని రూ. 404.35 కోట్లతో ఏర్పాటు చేయ‌డం అభినందనీయమన్నారు. అల్పాదాయ వర్గాలకు ఆర్థిక లబ్ధి చేకూర్చే నవరత్నాలు కార్యక్రమం అమలు చేశామన్నారు. విద్యార్ధిని, విద్యార్థులకు బైజూస్ కంటెంట్‌తో టాబ్‌లు ఇచ్చామన్నారు. విద్యార్థులను గ్లోబల్ సిటిజన్స్‌గా మార్చే కృషి జరుగుతుందన్నారు. ఇంగ్లీష్ మీడియం వలన విద్యార్థులు అంతర్జాతీయంగా పోటీ పడే పరిస్థితి తెచ్చామని గవర్నర్ ప్రకటించారు. .. అయితే గవర్నర్ ప్రసంగంలో చెప్పిన జగనన్న విద్యా దీవెన క్రింద పూర్తి రీయింబర్స్‌‌మెంట్ ఇచ్చామని గవర్నర్ చెబుతుండగా టీడీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. గవర్నర్ ప్రసంగం జరుగుతుండగానే టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. పూర్తి రీయింబర్స్‌మెంట్ అంతా అబద్ధమంటూ.. ఎందరో అర్హులయిన విద్యార్థులకు కూడా ఎగ్గొట్టారని తెలుగుదేశం సభ్యులు నిరసన తెలిపారు.మరో విడత వారు.. మెగా డీఎస్సీ కాదు… దగా డీఎస్సీ అంటూ నినాదాలు చేశారు. టీడీపీ సభ్యులు నిరసన తెలిపడంతో అయితే వెంటనే గవర్నర్ ఆగ్రహంతో ‘‘ మీరు చేస్తున్న పని నాకు త్రోట్ ఇరిటేషన్ ఉంది’’ అని చెప్పడంతో టీడీపీ సభ్యులు వెనక్కి తగ్గారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *